
ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా గురువారం థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడం కాకుండా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ “ఇదొక మాస్ ఎంటర్‌టైనర్ కాబట్టి, ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అనుకున్నాను. కానీ, మొదటి షో నుంచే అన్ని ప్రాం తాలలో పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారిలో చాలామంది.. సినిమాలో ఇంత కం టెంట్ ఉందని మాకు ముందు తెలియదు అంటూ ఆశ్చర్యపోతున్నా రు. కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందు లో కొన్ని మంచి అంశాలు చూపించాము. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో ఇంతవరకు చూపించని అక్రమ వలసదారులు అంశం గురించి సినిమాలో చర్చించాము. పాత్రలు బాగా పండాయి. ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు”అని అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఈ స్థాయి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఇంకా చూడనివాళ్ళు థియేటర్ కి వెళ్ళి చూడండి. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకు లు మెచ్చేలా ఈ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూపించారు. హరీష్ శంకర్ ఎంతో బాధ్యతగా గబ్బర్ సింగ్ ని మించేలా సినిమాని రూపొందించారు. ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ యలమంచిలి, ఆనంద్ సాయి, చంద్రబోస్ పాల్గొన్నారు.