
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కు త్వరలోనే తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈసారి బరిలో ఉన్న పది జట్లు కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేతలు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అయితే ఇతర జట్లతో పోల్చితే సన్‌రైజర్స్ టీమ్‌లో అత్యంత విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు తమ విధ్వంసక బ్యాటింగ్‌తో ఐపిఎల్‌లో ఎన్నో రికార్డులను తిరగ రాశారు. కొన్ని సీజన్‌లుగా వీరు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు.తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకు పడడం అలవాటుగా మార్చుకున్నారు.
ఈ సీజన్‌లో కూడా హెడ్, అభిషేక్‌లు ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోవడంతో సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. అభిషేక్, హెడ్‌లు ఎలా ఆడతారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోవడం ఇద్దరి ప్రత్యేకత. ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా వీరికుంది. ఐపిఎల్‌లో వీరిని మించిన విధ్వంసక ఓపెనర్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి లేదు. ఈసారి కూడా ఇద్దరు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగేందుకు సిద్ధమయ్యారు. హెడ్, అభిషేక్‌లు చెలరేగితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఇది కాస్త కలవరానికి గురి చేస్తోంది. అయితే ఐపిఎల్‌కు వచ్చే సరికి చెలరేగి పోవడం అభిషేక్‌కు అలవాటు. ఈసారి కూడా అదే సంప్రదయాన్ని కొనసాగించాలనే పటక్టుదలతో ఉన్నాడు. హెడ్ కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.