
జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సంవత్సరానికి గాను ’బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2026’ అవార్డును గెలుచుకుంది. స్కైట్రాక్స్ ద్వారా ఈ గౌరవం దక్కడం ఇది 5వ సారి, లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్ ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో 2వ స్థానం, భారత్-, దక్షిణాసియాలో 3వ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. 20-30 ఎంపిపిఎ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించింది. మా సిబ్బంది అంకితభావం వల్లే ఈ గుర్తింపు లభించిందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిఇఒ ప్రదీప్ పనిక్కర్ తెలిపారు. ప్రయాణికుల సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు ఈ అవార్డు దక్కింది.