Reading Time: < 1 minute

 సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రధ్దలతో జరుపుకునే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గురువారం ఆ కాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లిం లు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు. శనివారం రంజాన్ పండుగ (ఈద్‌ఉల్‌ఫితర్) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, లక్నో వంటి ప్రధాన నగరాల్లో నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తి కానుంది. పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు వివిధ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యే క ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక మ క్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ మసీదు, మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు, భద్ర తా చర్యలపై పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అ రేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకుంటుండగా, భారత్‌లో మాత్రం నెలవంక కనిపించని కారణంగా శనివారం వే డుకలు జరగనున్నాయి. ఈ పండుగతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగిసి, శవ్వాల్ మాసం ప్రారంభం కానుంది.