
ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క అసాధారణ చొరవ చూపారు. ఆయన పట్టుదలతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు ఏకంగా రూ.594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల (ఫోర్ లేన్) రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
హైబ్రిడ్ యా న్యుటీ మోడల్ (హెచ్‌ఏమ్) పద్ధతిలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఆయన కీలకంగా వ్యహరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమయిన రాకపోకలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ రహదారుల విస్తరణను ప్రభుత్వం చేపడుతోంది. రదారుల విస్తరణతో ఖమ్మం, వైరా, మధిర నియోజక వర్గాల్లో కనెక్టివిటీ పెరగడంతో పాటు స్థానికగా ఆర్ధిక వ్యవస్థకు ఊతం లభించనుం ది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్ర యోజనం చేకూరనుంది.
విస్తరించే రహదారులు ఇవే
* వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల్, ము జాఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు విస్తరించనున్నారు. మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 151.20 కోట్ల నిధులు మంజూరు అయ్యియి.
* మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మధిర, జిలుగుమాడు, ఆత్కూ రు, కిష్టాపురం సిరిపురం, కలకోట, బ్రహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొ త్తం 13.50 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు రూ. 81 కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
* మధిర ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి. మధిర, ఎల్లెందుల పాగు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు 18. 40 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ. 110.40 కోట్లు నిధులు ప్రభుత్వం వెచ్చించనుంది.
* ఖమ్మం నుంచి బోనకల్ వరకు 28.03 కిలోమీటర్ల రహదారిని రూ. 157.23 కోట్ల నిధులతో నాలుగు వరుసలుగా విస్తరించనుంది. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాలుగవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు ఈ పనులు జరుగనున్నాయి.
* బోనకల్, ఆళ్లపాడు వరకు 15.72 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 94.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారి బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు రహదారిని విస్తరణ జరుగనుంది.