Reading Time: < 1 minute

ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా వోక్స్‌వ్యాగన్ పోలో కారు.. ఖలాపూర్ సమీపంలో అతివేగం కారణంగా కంట్రోల్ తప్పి పలుమారలు పల్టీలు కొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు ఏర్పడింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. 

ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఐఐటి విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, వరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఖలాపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను నాసిక్‌కు చెందిన ఓంకార్ బోర్సే (22), నాగ్‌పూర్‌కు చెందిన లే భట్ (23), జైపూర్‌కు చెందిన శ్రేయాష్ శర్మ (22),,ముంబైలోని ఐఐటి పవాయ్ విద్యార్థులుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కలంబోలిలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.