Reading Time: < 1 minute

హైదరాబాద్: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు విప్ పదవి దక్కింది. శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభలో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం, చింతకుంట విజయ రమణారావులకు ఈ పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.