
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తను పెట్టబోయే పొలిటికల్ పార్టీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని కవిత చెప్పారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని.. పార్టీ ప్రారంభించినప్పుడే.. అజెండా, లక్ష్యాలు వెల్లడిస్తానని అన్నారు. డాడీ, మోడీ, చిన్న మోడీపైనే తన పోరాటం ఉంటుందన్నారు. బిఆర్ఎస్‌తో తన సమస్యను కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఆమె విమర్శించారు.