
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా పలు కీలక సూచనలు చేశాడు. రానున్న ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ ముందుకు సాగాలంటే కెప్టెన్ అక్షర్ పటేల్ తన పద్ధతిని మార్చుకోక తప్పదన్నాడు. అక్షర్ మైదానంలో చాలా ప్ర శాంతంగా ఉంటాడన్నాడు. అయితే ఐపిఎల్ వంటి తీవ్ర ఒత్తిడి ఉండే టోర్నీలో ఇలా ఉం డడం సరికాదన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ సహచరుల్లో కొత్త ఉత్సాహం నింపాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుందన్నాడు. అక్షర్ మాత్రం ప్రశాంతంగా ఉంటూ ఆటగాళ్లలో ఎలాంటి ఉత్సాహం నింపడం లేదన్నాడు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతుందన్నాడు. దీనికి కిందటి సీజన్‌లో ఢిల్లీ ప్రదర్శనే నిదర్శనమని పుజారా పేర్కొన్నాడు.