
భోపాల్: ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి ఓ వ్యక్తి నిద్రపోయాడు. వాహనం పేలిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రిజేశ్వరి అనెక్స్ అనే బహుళ అంతస్థు భవనానికి మనోజ్ పుగాలియా అనే వ్యక్తి యజమానిగా ఉన్నాడు. అతడు ఆ భవనంలో పాలిమర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి నిద్రపోయాడు. ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించడంలో మంటలు చేలరేగాయి. పాలిమర్స్ కు మంటలు అంటుకోవడంతో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఒకదాని తరువాత ఒకటి పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ మంటల్లో ఏడుగురు సజీవదహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.