
ఇస్లామాబాద్: మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మ్యాక్స్‌వెల్, లబుషేన్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టీమ్ ఫైన్, గిలెస్పీ పలు జట్లకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొనడంతో లీగ్ నిర్వహణ ప్రమాదంలో పడింది. అప్ఘాన్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి పాల్పడడంతో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాక్‌లో క్రికెట్ ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పెషావర్ సిటీకి వెళ్లకండని తమ క్రికెటర్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచనలు చేసింది. మార్చి 28న పెషావర్‌లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో జల్మీ-రావల్పిండిజ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సభ్యులుగా ఉండడంతో ఆ దేశం హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసీస్ ఆటగాళ్లను ప్రైవేటు విమానాల్లో స్వదేశానికి తరలిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. మరో వైపు సూపర్ లీగ్ 11 వ ఎడిషన్ నుంచి అప్ఘాన్ ఆటగాళ్లు తొలిగిన విషయం తెలిసిందే.