Reading Time: < 1 minute

 ఈశాన్య నైజీరియా లోని మైడుగురి సిటీని టార్గెట్ చేస్తూ సోమవారం రాత్రి ఆత్మాహుతి బాంబుల దాడికి 23 మంది ప్రాణాలు కోల్పోవగా, 108 మంది గాయపడ్డారు. సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ఈ నగరంలో అత్యంత ప్రాణాంతక దాడి ఇదేనని చెబుతున్నారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైడుగురిలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, యూనివర్శిటీ ఆఫ్ మైడుగురి టీచింగ్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు జరిగాయని స్థానికులు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించక పోయినప్పటికీ, బొకో హరామ్ జీహాదీ గ్రూప్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేయడానికి బోకో హరామ్ జీహాదీ గ్రూప్ 2009 నుంచి తిరుగుబాటు చేస్తోంది. అందులోని భాగమే ఈ దాడులని అనుమానిస్తున్నారు.