
రాష్ట్రంలో 35 తెలంగాణ గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియేట్ మొదటి ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఆర్‌జెసి సెట్‌కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన టిజిఆర్‌జెఎసి సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.