Reading Time: < 1 minute

ఢిల్లీ: రీల్స్ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పవన్ అనే యువకుడు తుపాకీ పట్టుకొని రీల్స్ చేస్తున్నాడు. అతడి స్నేహితుడు వీడియో రికార్డు చేస్తున్నాడు. తుపాకీ లోడ్ చేసిన అనంతరం చాతీ వైపు తుపాకీ గురి పట్టుకొని నిలబడ్డాడు. నవ్వుతూ వీడియో తీయమని ట్రిగ్గర్‌పై వేలు పెట్టడంతో చాతీలోనికి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే కుప్పకూలి అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ గన్‌కు లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు. రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని నెటిజన్లు మండిపడుతున్నారు.