Reading Time: < 1 minute

హైదరాబాద్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా సీతక్క మాట్లాడారు. స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు. గతంలో మహిళల వడ్డీ లేని రుణాలు రూ. 3 వేల కోట్లు బాకీ పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు రూ. 1121 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించామని సీతక్క పేర్కొన్నారు.