
హైదరాబాద్: మరో పది రోజుల్లో ఐపిఎల్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శామ్సన్ 2018 నుంచి 2025 వరకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సంజూ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి తాను ఆడానని, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుందని, రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తన సమయం ముగిసిందని, అందుకే ఆర్‌ఆర్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజస్థాన్‌కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి అని సంజూ చెప్పాడు. ప్రతి ఒక్కరూ మైదానంలోకి దిగాక ఆట గురించే ఆలోచిస్తానని, మరొకటి ఉండదన్నారు. చైన్నై సూపర్ కింగ్స్‌లో ఉండటం అనేది తనకు కొత్త ప్రయాణమని, రాజస్థాన్ రాయల్స్‌పై చాలా సంతోషంగా ఆడుతానని సంజూ వివరణ ఇచ్చాడు.