Reading Time: < 1 minute

హైదరాబాద్: అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా  కెటిఆర్ ప్రసంగించారు. రెండున్నరేళ్లలో రూ.2.5 లక్షలు అందుకున్న కుటుంబాలను చూపించండని, సిఎం రేవంత్ రెడ్డి సంతకానికే విలువ లేకుంటే వీళ్ల మాటలు ఎవరు నమ్ముతారు? అని.. గ్యారెంటీల, హామీల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. భవిష్యత్ లో సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదని, సిఎం సంతకం చేసిన ఆరు హామీల ఫైల్ డిప్యూటీ సిఎంకు దొరికిందనుకున్నానని అన్నారు. ఎన్నికలకు ముందు దానకర్ణ.. ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అని కెటిఆర్ విమర్శించారు.. హామీలకు, గ్యారెంటీలకు జీరో వ్యాల్యూ ఉందని, ప్రజల ఆస్తుల విలువ జీరో వ్యాల్యూ చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తే తమకేం అభ్యంతరం లేదని ఎన్నిసార్లైనా వెళ్లండి అని సూచించారు. ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.. కానీ నిధులు ఇచ్చి వస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయని మీరే చెప్పారని, తప్పు జరిగితే…ఐటీ సెక్రటరీని తీసేయండని  సూచించారు. కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలోనూ విశ్వనీయత లేదని కెటిఆర్ దుయ్యబట్టారు.