Reading Time: < 1 minute

కాబూల్: అప్ఘానిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్ఘాన్‌లోని ఓ ఆస్పత్రిపై పాక్ వైమానికి దాడికి పాల్పడింది. దీంతో 400 మంది మృతి చెందారని ఆప్ఘాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిలో మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఆ ఆస్పత్రిపై పాక్ వైమానిక విభాగం దాడి చేసిందని అప్ఘాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ తెలిపారు. భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఆస్పత్రి లక్షంగా తాము దాడులు చేయలేదని పాక్ తీవ్రంగా ఖండించింది. అప్ఘాన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌళిక సదుపాయాలే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నామని పాక్ సమాచార మంత్రిత్వశాఖ వివరించింది. అప్ఘాన్ పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా దాడులకు పాల్పడుతున్నామని ప్రకటించింది.