Reading Time: < 1 minute

ఎల్ బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ‘వైట్ కప్ కేఫే’ పేరుతో నడుస్తున్న హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో *“వైట్ కప్ కేఫే” పేరుతో అక్రమంగా నడుస్తున్న హుక్కా పార్లర్‌పై ఎసిపి ఏ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీస్ బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా ఎసిపి ఎ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం… దాడి సమయంలో అక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండగా, వారు ప్రధానంగా సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్  సమీప ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. అక్రమంగా హుక్కా సేవలు నిర్వహిస్తున్నందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.