
నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన రైల్వే పోలీసులు..
మన తెలంగాణ/కాచిగూడ : హైదరాబాద్ నగరంలో మరోసారి మత్తు పదార్థాల రవాణా బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అమ్మడానికి తీసుకొచ్చిన ఓ పాత నేరస్థుడిన్ని కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే పోలీస్ ఇన్స్ స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప, ఆర్పిఎఫ్ ఎస్ఐ రజిత వివరాలు వెల్లడించారు. పాతబస్తీలోని యాకుత్ పురకు చెందిన మహ్మద్ అబ్దు ల్ హసన్ (32) పాత నేరస్థుడు. గతంలో నాలుగైదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం చేసినట్టు కేసులు నమోదయ్యాయి. నాందేడ్ లో 2కిలో ల గంజాయిన కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చాడు. దీని విలువ దాదాపు రూ.1లక్ష వరకు ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో 3వ ప్లాట్ ఫాంపై అనుమానస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహ్మద్ అబ్దుల్ హసన్ వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందు లో 2కిలోల గంజాయి ఉంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.