
ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును వెనుక నుంచి అశోక్ లేలాండ్ లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ ( 51), షేక్ పేటకు చెందిన మొహమ్మద్ హుస్సేన్ ( 48), లు టీఎస్ 09 ఈడీ 3303 నంబర్ గల ఆడి కారులో ఈసీఐఎల్ నుండి తూప్రాన్ వైపు ఓ ఆర్ ఆర్ మార్గం ద్వారా వెళ్తున్నారు.
మార్గమధ్యంలో శామీర్ పేట ఎగ్జిట్ 7 దిగ చొట కారును రోడ్డు పక్కన నిలిపి భోజనం భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్‌ఎచ్ 12 పి క్యు 2337 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ ( డిడి ) పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది. ఈ ఘటనపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.