Reading Time: < 1 minute

లోక్‌సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై మంగళవాం నాడు సస్పెన్షన్ ఎత్తివేయనున్నారు. స్పీకర్ ఓంబిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సస్పెండయిన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.