Reading Time: < 1 minute

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరూక్‌ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఫరూక్‌నగర్‌ బస్‌డిపో పక్కనున్న ఫర్మిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. వేగంగా వ్యాపించిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఘటనాస్థలంలోని పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫర్నిచర్ షాపులో ఎగిసిపడుతున్న మంటలను ఫైరింజన్లతో అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.