Reading Time: < 1 minute

ఇటీవల టి-20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 వరకూ చేరి.. ఓటమిపాలై.. ఇంటి ముఖం పట్టిన పాకిస్థాన్‌కు తాజాగా మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ పర్యటనలో మూడో వన్డేలో ఓటమిపాలైన పాక్.. 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. తమ టీమ్‌పై దారుణంగా సెటైర్లు వేశాడు. పాక్‌కు ఎలాగూ ట్రోఫీలు గెలిచే సత్తా లేదని.. కనీసం ట్రోఫీలు అయినా దొంగిలించాలని చురకలు అంటించాడు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్ సైతం పాక్‌ను ఓడించి.. టెస్ట్ క్రికెట్ హోదా కైవసం చేసుకుంటుంది. ఇదీ పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి. బంగ్లాదేశ్ నిజానికి చాలా తేలికగా 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వాళ్లు 290కే పరిమితమయ్యారు. లిటన్ దాస్ నెమ్మదిగా ఆడాడు. అయినా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మ్యాచుల్లో ప్రత్యర్థులను ఓడించలేకపోతే.. మీరు ఇఖ ఐసిసి ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే’’ అని అక్మల్ అన్నాడు.మీరు ఎలాగూ గెలవరూ.. కనీసం ట్రోఫీలైనా దొంగిలించండి: అక్మల్ అన్నాడు.