
చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవిక నాయ ర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఇది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా మేకింగ్ ఒక హాలీవుడ్ లెవెల్‌లో ఉంటుంది. దర్శకుడు అభిలాష్ ఆలోచన కూడా అదే. ఇందులో కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, చాలా బలమైన ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ కూడా ఉంది. మేము మా సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం. రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చేశాం’ అని అన్నారు.