Reading Time: < 1 minute

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై కామాంధుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజీని కూడా పరిశీలించారు. సిసిటివి ఫుటేజీలో బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. వెంటనే హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. రాత్రి ఒంటి గంటకు బాలిక మృతదేహాన్ని హంతకుడు చూపించాడు. అత్యాచారం అండ్ మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.