
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే టిడిపి ఎంపిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతోనే స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మహేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెలైట్ రోహిత్ రెడ్డి తో పాటు అయన సోదరుడికి పాజిటివ్ వచ్చింది.