Reading Time: < 1 minute

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఔటుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్యూషన్‌కు వెళ్లి అన్నదమ్ములు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వాహనాల తనఖీలు చేపట్టారు. యువకుడు భయపడి బైక్‌ను వెనక్కి తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించాడు. అతడు కీసరపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. అయితే బైక్‌ను ఆపే క్రమంలో.. కానిస్టేబుల్ వెంటపడి బైక్ హ్యాండిల్‌ను పట్టుకొని లాగారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.