
అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక తీవ్ర ఇబ్బంది పడి మృతి చెందారు. ఇంట్లో బైకు ఉంచిన గదిలోనే అందరూ నిద్రించటంతో విషాద చాయలు అలుముకున్నాయి. బైకు సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్ లో ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చందన(8), చరిత(8), కార్తీక్(15), రామచంద్రయ్య(70)గా పోలీసులు గుర్తించారు.