Reading Time: < 1 minute

సాఫ్ట్‌వేర్ రంగంపై కృత్రిమ మేధ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పని మొదలుపెట్టాయి. త్వరలో మెటా కూడా అదే బాటలో పయనిస్తోందని సమాచారం . ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా త్వరలో 16 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మెటా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని మెటా భావిస్తోందట. మెటాలో ప్రస్తుతం 79 వేల మంది పని చేస్తున్నారు. వారిలో 20 శాతం మందిని మెటా తొలగించనుందట. అంటే దాదాపు 16 వేల మంది లేఆఫ్ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు.