
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు.
చాలా రోజుల తర్వాత పవన్ నుంచి మాస్ ఎంటర్ టైన్మెంట్ రాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.