Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి వీలుగా రూ.1 లక్షకోట్లతో ‘ ఆర్థిక స్థిరీకరణ నిధి ’ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనూహ్య పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆమె వివరించారు. లోక్‌సభలో రెండో విడత అనుబంధ పద్దులపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రెండో విడత అనుబంధ పద్దులకు సంబంధించిన డిమాండ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.81 లక్షల కోట్లను ఖర్చుచేయడానికి ప్రభుత్వం లోక్‌సభ అనుమతి కోరిందని, అలాగే అదనంగా మరో రూ.80 వేల కోట్ల వరకు ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్‌లో ఉన్నట్టు చెప్పారు. ఈ నిధి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ లక్షాలు దెబ్బతినకుండా చూస్తుంది. 202526 ఆర్థిక సంవత్సరానికి రూ.2.81 లక్షల కోట్ల అనుబంధ బడ్జెట్‌లో ఈ నిధి భాగం.