
పశ్చిమాసియాలో ఇరాన్ – అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.సోహార్ నగరంలోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతం. మస్కట్ నుండి ఇది సుమారు 200 కి.మీ దూరంలో ఉంది.మరణించిన ఇద్దరూ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ కార్మికులు.ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడగా వారిలో 10 మంది భారతీయులే.ఒమన్ రక్షణ వ్యవస్థలు రెండు డ్రోన్లను కూల్చివేసినప్పటికీ ఒక డ్రోన్ శిథిలాలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.