Reading Time: < 1 minute

 సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కడప జిల్లా, పులివెందుల మండలం, పెద్ద జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ హైదరాబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్. ఇద్దరు సోషల్ మీడియాలో సినీనటి అనసూయ భరద్వాజ్‌పై గత కొంత కాలం నుంచి అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ టైంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆమె క్యారెక్టర్‌ను దిగార్చే విధంగా కామెంట్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అనసూయపై అసభ్య కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అనసూయ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.