
హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టిసి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులపై ఆధిక పని భారం తగ్గించాలి’’ అని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.