July 11, 2026

Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు

Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు
Reading Time: < 1 minute
Siddu Jonnalagadda Lines Up Three New Movies After Telusu Kadha

చివరిగా ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమా సహా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కొత్త దర్శకుడితో ఒక సోషియో ఫాంటసీ సినిమా ఆయన చేయబోతున్నాడని, అలాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో మరో సినిమా లైన్లో పెట్టాడని, ప్రస్తుతానికి ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరితో మరో సినిమా కూడా లాక్ చేశాడని తెలుస్తుంది.

Also Read:Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

నిజానికి ‘తెలుసు కదా’ సినిమా సాలిడ్ హిట్ అవుతుందని సిద్ధు నమ్మాడు, కానీ ఆ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతానికి తన ఫిల్మోగ్రఫీని విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విధంగానే మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అవి కొత్త ఐడియాస్ అని, కచ్చితంగా ఆ మూడిటితో హిట్టు కొడతానని నమ్మకంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. సిద్ధు నటిస్తున్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.