July 11, 2026

అమ్రాబాద్: గిరిజన పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

అమ్రాబాద్: గిరిజన పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ
Reading Time: < 1 minute

అమ్రాబాద్: గిరిజన పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

Caption of Image.

అమ్రాబాద్/అచ్చంపేట, వెలుగు :  మన్ననూర్ పీటీజీ చెంచు రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడిన ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఓవర్ హెడ్ ట్యాంక్ నీరు అపరిశుభ్రంగా ఉండటంపై ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా సిబ్బంది పనితీరు మారకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

నాణ్యమైన సరుకులతో వంట చేయాలని, హైమస్ట్ లైట్లు, శానిటేషన్ డ్రైవ్, ఆర్డీఓ పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అచ్చంపేట మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో సర్పంచ్ జగత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. నల్లమల ప్రాంతంలోని ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇంటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఆ తర్వాత అదే గ్రామంలోని లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన ఐఎన్టీయూసీ సమావేశంలో పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.