హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం..బైక్లు, కార్లు, బస్లు పోయేందుకు వేర్వేరుగా మార్కింగ్

- హుమ్టా కొత్త ప్లాన్.. కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్
- మొదటి దశలో మూడు రూట్లలో అమలు
- ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
ఏంటీ ప్లాన్?
సిటీలో ముందు ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పలు అభివృద్ధి పనులు చేపడతారు. మొదటి దశలో మియాపూర్ టు గండిమైసమ్మ, ఒవైసీ హాస్పిటల్ టు తార్నాక, ప్యారడైజ్ టు అసెంబ్లీ ప్రాంతాల్లో ఈ ప్లాన్అమలు చేస్తారు.
ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించడంతో పాటు మెయిన్రోడ్లపై నాన్ మోటో రైజ్డ్ ట్రాన్స్పోర్ట్ లైన్లు ఏర్పాటు చేస్తారు. అంటే ఈ వేలో మోటార్‌వాహనాలను అస్సలే అనుమతించారు. కేవలం నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తారు. ఆయా ప్రాంతాల్లో జంక్షన్లను రీ డెవలప్ మెంట్, యూ టర్న్స్ ఏర్పాటు వంటి పనుల ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించనున్నారు.
అలాగే, యూనిఫామ్సెంట్రల్మీడియన్ డెవలప్మెంట్ పనులు కూడా చేస్తారు. స్పేస్వాకర్స్పేరుతో రోడ్లపై బైక్లు, కార్లు, బస్‌లకు వేర్వేరుగా మార్కింగ్ వేస్తారు. ఈ మార్కింగ్‌లోనే సదరు వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.