July 11, 2026

Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్‌ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్

Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్‌ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
Reading Time: < 1 minute
Sreeleela Trolled As Iron Leg After Lenin Movie Success

టాలీవుడ్‌లో ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు శ్రీలీలను ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ అని కామెంట్స్  చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి.  లీల కాల్షీట్స్ కోసం క్యూ కట్టినవాళ్లే. లీల డ్యాన్స్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ వరుస ఫ్లాప్స్ వైరల్ వయ్యారీ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అంతే కాదు ఏదైనా సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా తీసుకున్నారు అనగానే ఆ సినిమా డిజాస్టరేనన్న ఓపెన్ కామెంట్స్ వచ్చేవి. తాజాగా లెనిన్ వల్ల మరోసారి ట్రోల్ అవుతోంది శ్రీలీల.

లెనిన్ తాజాగా రిలీజై మంచి టాక్‌తో దూసుకెళుతోంది. అఖిల్ నటనతో పాటు భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్‌ను పొగిడేస్తున్నారు ఆడియన్స్. అక్కడ వరకు ఆగకుండా ఈ మూవీ నుండి శ్రీలీల తప్పుకోవడంపై హ్యాపీని వ్యక్తం చేస్తున్నారు. లీల ఉంటే సినిమా షెడ్డుకు వెళ్లిపోయేదన్న కామెంట్స్ చేస్తున్నారు రివ్యూయర్స్. కిస్సిక్ బ్యూటీ డేట్స్ ఇష్యూ వల్ల సినిమా నుండి తప్పుకోవడం మంచిదయ్యిందటూ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్లీ ప్రొడ్యూసర్ సైతం లీలను బ్యాడ్ అంటూనే కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రజెంట్ శ్రీలీల టాలీవుడ్‌లో నెగిటివిటీని మూటగట్టుకుంది. డ్యాన్స్ తప్ప మరోటి రాదన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌పై గట్టిప్రభావాన్నేచూపిస్తుంది. వీటికి తోడు ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ ట్యాగ్స్ ఆమెను టాలీవుడ్‌కు దూరం చేస్తున్నాయి. ఇక్కడి హీరోస్, మేకర్స్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న లీల  అక్కడ హిట్ కొట్టి తనపై పడిన మరకను చెరిపేసుకుని మళ్లీ గోల్డెన్ లేడీ అనిపించుకుంటుందేమో చూడాలి.