July 11, 2026

దైవాలగూడలో రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు.. ఎవరిని ఎలా చంపాడంటే..

దైవాలగూడలో రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు.. ఎవరిని ఎలా చంపాడంటే..
Reading Time: 2 minutes

దైవాలగూడలో రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు.. ఎవరిని ఎలా చంపాడంటే..

Caption of Image.

దైవాలగూడ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దైవాలగూడలో ఈ హత్యలకు పాల్పడ్డాడు.

రాత్రి 11 గంటలకు దైవాలగూడకు వెళ్లి బాధిత బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మ అడ్డుకున్నా బలవంతంగా బాలికను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తిరిగి వెళ్లి బాలిక నాయనమ్మను, అమ్మమ్మను వెతికి మరీ అతి కిరాతకంగా చంపేశాడు. తర్వాత రాజ్ కుమార్ తన భార్యకు కాల్ చేశాడు.

ఇలా.. బయటికొచ్చానని.. పిల్లలను చూడాలని ఉందని, తాను వస్తున్నట్లు ఎవరికీ చెప్పొద్దని భార్యకు ఎమోషనల్గా చెప్పాడు. భర్త పిల్లలపై బెంగతో బాధపడుతున్నాడని భావించిన రాజ్ కుమార్ భార్య ఇంటికి రమ్మని చెప్పింది. భార్యను నమ్మించి ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ ఇంట్లోకి వెళ్లగానే భార్యపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె బయటకు పరిగెత్తింది. ఈ క్రమంలో.. ఇంట్లోకి లాక్కెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపి కారులో పారిపోయాడు. తన కన్న తండ్రికి కాల్ చేసి ఇలా ఆరుగురిని హత్య చేశానని రాజ్‌కుమార్‌ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి ఈ హత్యలపై ఏం చెప్పారంటే..
* రాత్రి హత్య జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది
* రెండు ప్లేస్లలో హత్య జరిగింది
* మొదట షాబాద్ లోని భాధితురాలి ఇంట్లోకి రాత్రి 11 గంటలకు వెళ్ళాడు 
* అక్కడ  భాధితురాలి తల్లి, నానమ్మ ను హత్య చేసాడు
* మే 16 న అతని పైన ఫోక్సో కేసు నమోదు అయ్యింది
* ఈ కేసులో అతనికి  బెయిల్ దొరికింది
* అతనికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు
* బాధితురాలికి తల్లి, నానమ్మ ఉన్నారు
* కత్తితో తల్లిని నానమ్మ ను చంపాడు
* ఆ తరువాత బాలికను నగర్ కుంట దగ్గరికి తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేసాడు
* ఆ తరువాత తన ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలను చంపాడు
* రాజ్ కుమార్ తల్లిదండ్రులకి కాల్ చేసి నేను అరుగురిని చంపాను… నేను కూడా చనిపోతున్నాను అని చెప్పాడు
* మృతదేహలను ఆసుపత్రి కి తరలించాము
* రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు
* 7 బృందాలుగా నిందితుని కోసం గాలింపు చేపడుతున్నాము

©️ VIL Media Pvt Ltd.