బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. క్యూ కడుతున్న జనాలు.. మార్కెట్లో ఫుల్ డిమాండ్!
వానలు మొదలవ్వగానే ఉత్తరప్రదేశ్లోని ఈ అరుదైన కూరగాయ కోసం ఎంతో మంది క్యూ లు కడతారు. కటరువాగా పిలుచుకునే ఈ అడవి కూరగాయ ప్రత్యేకమైనది. నిజం చెప్పాలంటే, నాన్ వెజ్ కన్నా దీని ధరే ఎక్కువ. మరి, ఇది ఎందుకంత క్రేజ్ సంపాదించుకుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఈ కటరువా మార్కెట్లో కేజీ ధర రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఉంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. కొన్నిసార్లు చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువగా పలుకుతుంది. అయినా కూడా జనాలు దీనిని ఎగబడి మరి కొంటున్నారు. వర్షాకాలం మొదలైతే చాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. నాన్ వెజ్ తినని వాళ్లకి ఇదే సూపర్ ఫుడ్.
చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కటరువా విలువైన కూరగాయ. మాంసం తినని వాళ్ళకి ఇదే మాంసం లాగా అన్నమాట. ఎందుకంటే, దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా రుచిలో కూడా నెంబర్ 1. అందుకే దీనికి డిమాండ్ భారీగా పెరిగింది. ప్రతి యేటా
దీని ధర ఆకాశాన్నంటుతున్నా ,జనాలు మాత్రం కొంటునే ఉన్నారు.
ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అందుకే ఈ కటరువాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీనిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీనిని మీ ఫుడ్ లో తీసుకోవడం వల్ల శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను వస్తుంది ఇంకా అలసట వంటి సమస్యలు తగ్గతాయి.
కొందరు నిపుణుల ఏం చెప్పారంటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను అదుపు చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందని అంటున్నారు. అంతేకాదు, గుండె సమస్యలు రాకుండా ఇది చేస్తుంది. ఈ కటరువా అంత మేలు చేస్తుంది. ఇంకా ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. అందుకే జనాలు కూడా కొనడానికి మొగ్గు చూపుతున్నారు.




