Reading Time: < 1 minute

ఏరోబిన్స్లో 50 రోజుల్లో కంపోస్ట్ రెడీ.. వంట గది, తోట తడి వ్యర్థాలతో తయారీ

Caption of Image.
  • ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

మేడిపల్లి, వెలుగు: పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ లో మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన ఏరోబిన్స్‌ను కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంట గది, తోట తడి వ్యర్థాలను ఏరోబిన్స్‌లో వేశాక.. వాటిలోని లంగ్​ఏరియేషన్​సిస్టమ్​గాలిని అందించి, బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందడానికి సహాయపడుతుందని తెలిపారు. దీనివల్ల 45 నుంచి 50 రోజుల్లో నాణ్యమైన సేంద్రియ ఎరువు(కంపోస్ట్) తయారవుతుందని చెప్పారు. 400 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్రతీ ఏరోబిన్ తడి చెత్త నిర్వహణకు సమర్థంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్(శానిటేషన్) రఘు ప్రసాద్, ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాహ్నవి, అసిస్టెంట్ ఇంజినీర్ మహేశ్, మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.