July 10, 2026

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh To Be First Film Screened In Allu Cinemas Dolby Cinema

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘డాల్బీ సినిమా’ స్క్రీన్‌లో ప్రదర్శించబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డులకెక్కనుంది. అల్లు ఫ్యామిలీ ఆధ్వర్యంలో ‘అల్లు సినిమాస్’ అంటూ ఒక మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌లోనే డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ థియేటర్‌ను నిన్ననే రేవంత్ రెడ్డి ప్రారంభించగా, ఈరోజు ప్రత్యేకంగా ఫిలిం మీడియాను ఆహ్వానించి అల్లు అరవింద్ మరో కార్యక్రమాన్ని నిర్వహించి, వారందరికీ థియేటర్‌ను చూపించారు.

Also Read :Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వాస్తవానికి కాస్త ఆలస్యంగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను, ఉగాది సందర్భంగా మార్చి 19వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.