July 11, 2026

ల్యాబ్ టెక్నీషియన్ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ…11 మంది అభ్యర్థుల ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు

ల్యాబ్ టెక్నీషియన్  స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ...11 మంది అభ్యర్థుల ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
Reading Time: < 1 minute

ల్యాబ్ టెక్నీషియన్ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ…11 మంది అభ్యర్థుల ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2024 సెప్టెంబర్ 24న 1,284 పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌‌ లో భాగంగా, తాజాగా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీ కింద 11 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

స్పోర్ట్స్ కోటా కోసం కేటాయించిన 18 పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పంపిన ప్రయారిటీ లిస్ట్‌‌ ను పరిశీలించిన అనంతరం ఈ సెలక్షన్ లిస్ట్‌‌ ను ప్రకటించారు. గతంలో ఈ కేటగిరీపై వచ్చిన 27 అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే ఫైనల్ లిస్టును సిద్ధం చేసినట్లు బోర్డు వెల్లడించింది. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తీర్పునకు లోబడే ఈ నియామకాలు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇతర కేటగిరీల భర్తీ పూర్తికాగా,  ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల కావడంతో ఈ నోటిఫికేషన్ ప్రక్రియ దాదాపు ముగిసినట్లయింది.

©️ VIL Media Pvt Ltd.