July 11, 2026

రూల్స్ బ్రేక్ చేసిన 53 పరిశ్రమల మూసివేత…రూ.1.75 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు జప్తు: టీజీపీసీబీ

రూల్స్ బ్రేక్ చేసిన 53 పరిశ్రమల మూసివేత...రూ.1.75 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు జప్తు: టీజీపీసీబీ
Reading Time: < 1 minute

రూల్స్ బ్రేక్ చేసిన 53 పరిశ్రమల మూసివేత…రూ.1.75 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు జప్తు: టీజీపీసీబీ

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: రూల్స్​బ్రేక్​చేసిన పరిశ్రమలపై  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) కఠిన చర్యలకు దిగింది. 2026 జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తనిఖీల్లో రాష్ట్రంలోని 260 పరిశ్రమల పనితీరును టీజీపీసీబీ పరిశీలించింది. ఇందులో రూల్స్​పాటించని 53 పరిశ్రమలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపివేయాలని పేర్కొంది. 

మరో 118 పరిశ్రమలకు లోపాలను సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1.75 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారెంటీలను జప్తు చేసింది. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని టీజీపీసీబీ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.