డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!

టెక్నో నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 50 Ultra 5Gను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జూలై 17 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో పరిచయమైన ఈ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
AI కెమెరా ఫీచర్లే హైలైట్:
“Sees It All” అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన అధునాతన AI ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తోంది. క్షణాల్లో తీసిన ఫొటోలను మరింత అందంగా మార్చే టెక్నాలజీ ఇందులో ఉంది. ఈ ఫోన్‌లో అందించే ముఖ్యమైన AI ఫీచర్లు ఇవే..
* AI Photo Enhancement: ఫొటోలలోని వివరాలను ఆటోమేటిక్‌గా మెరుగుపరుస్తుంది.
* AI Object Removal: ఫొటోల్లో అనవసరంగా కనిపించే వ్యక్తులు లేదా వస్తువులను సులభంగా తొలగించవచ్చు.
* AI Content Creation Tools: మొబైల్‌లోనే ఫొటోలు, వీడియోలను వేగంగా ఎడిట్ చేసుకునే సౌకర్యం.
అలాగే వెనుక భాగంలో మల్టీ కెమెరా సెటప్‌తో పాటు ప్రత్యేక ఫ్లాష్ మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించింది.
ప్రీమియం లుక్:
TECNO CAMON 50 Ultra 5Gలో కంపెనీ “Silk-Flow” డిజైన్‌ను ఉపయోగించింది. స్లిమ్ బాడీ, షైనింగ్ ఫినిష్, మంచి నిర్మాణంతో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. రోజంతా ఉపయోగించుకునేలా భారీ బ్యాటరీని కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్ (Dolby Atmos) సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో సినిమాలు చూడటం, గేమింగ్, మ్యూజిక్ వినేటప్పుడు మెరుగైన ఆడియో అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు. ఈ మొబైల్ సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్, నెబ్యులా టైటానియం అనే 3 స్టైలిష్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.
జూలై 17న లాంచ్ అయిన తర్వాత అమెజాన్ ద్వారా ఈ TECNO CAMON 50 Ultra 5Gను కొనుగోలు చేయవచ్చు. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.