Reading Time: < 1 minute

తిరుపతిలో చిరుతపులి సంచారం…జూన్ నెలలో కూడా ఇదే ఏరియాలో…

Caption of Image.

తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానిక గ్రాండ్ ఓల్డ్ 15వ క్రాస్ దగ్గర రాత్రి సమయంలో చిరుత రోడ్డు మీద వెళ్తున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జూన్ నెలలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత దున్నపోతును చంపేందుకు ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. మరోసారి ఇదే ప్రాంతంలో అపార్ట్మెంట్ ముందు చిరుతపులి సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం.

అపార్ట్మెంట్ ముందు చిరుత పులి నడుచుకుంటూ వెళ్లే విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వణికిపోతున్నారు అపార్ట్మెంట్ వాసులు.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత సంచరించే ప్రాంతంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. ప్రాంతంలో ఒంటరిగా ఎవరు తిరగదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

©️ VIL Media Pvt Ltd.