
హైదరాబాద్: టి20 ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత జట్టు ఎక్కువగా బ్యాటింగ్‌తో అదరగొట్టి సెమీఫైనల్‌కు వరకు చేరుకుంది. బ్యాటింగ్ విభాగంలో సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా, అభిషేక్ శర్మలు రాణించారు. బౌలింగ్ విభాగం వచ్చేసరికి భారత జట్టు బుమ్రాపైనే అదారపడి ఉంది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. దీంతో అతడిని మాజీలు, విదేశీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ జస్ప్రీత్ బుమ్రాను కొనియాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని మెచ్చుకున్నారు. బుమ్రా లాంటి ఆటగాడు తమ జట్టులో ఉంటే వరల్డ్ కప్ గెలుస్తామని స్పష్టం చేశారు. ఇండియా పేస్‌గుర్రం బుమ్రాను లియోనో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రపంచ క్రీడాకారులతో పాల్చాడు. 1985 నుంచి తాను క్రికెట్ చూస్తున్నానని, తాను చూసిన బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని వాన్ ప్రశంసించారు. టి20 వరల్డ్ కప్ 2026లో 14 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పొదుపు బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.