Reading Time: < 1 minute

అమరావతి: చేపలు పడుతుండగా బతికున్న గొంతులో ఇరుక్కోవడంతో మత్సకారుడు ఊపిరాడక విలవిలలాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సముద్రంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. వలలో చేపలు పట్టి బయటకు తీసుకొచ్చాడు. వల నుంచి చేపలను వేరు మరో మత్సకారుడితో మాట్లాడుతున్నాడు. చేప ఒక్కసారిగా ఎగిరి అతడి నోట్లో పడింది. వెంటనే గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిలలాడాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. గొంతు వద్ద ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశాడు. జిజిహెచ్ ఇఎన్‌టి విభాగం వైద్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకరి ప్రాణం కాపాడారని కొనియాడాతున్నారు.