Reading Time: < 1 minute

చెన్నై: ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తి కోర్టు మరణశిక్ష విధించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో జరిగింది. మేళపాళయం ప్రాంతం అళగిరిపురానికి చెందిన ఆనంద్ శేఖర్(41) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో ముగ్గురు బాలికలను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి తిరునెల్వేలి కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాదితురాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహ్వారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.